బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం : వెరబెల్లి రఘునాథ్​రావు

చిర్యాల, వెలుగు : రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తేనే మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు అన్నారు. రఘునాథ్ ​ఫౌండేషన్​ ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాలలోని ఆర్​బీహెచ్​వీ స్కూల్​ గ్రౌండ్​లో మహిళలకు బతకమ్మ చీరలు పంపిణీ చేశారు. ముఖ్య​అతిథులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్​ జి.వివేక్​ వెంకటస్వామి, దుబ్బాక ఎమ్మెల్యే బి.రఘునందన్​రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునాథ్​రావు మాట్లాడుతూ నడిపెల్లి దివాకర్​రావును నాలుగుసార్లు గెలిపించినా మంచిర్యాలకు ఆయన చేసిందేమీ లేదన్నారు.

గవర్నమెంట్​ హాస్పిటల్​లో పేదలకు వైద్యం అందడం లేదని తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ను పోలీస్​ స్టేషన్​ పక్కన కట్టుకొని ఎంసీహెచ్​ను గంగొడ్డున కట్టారని, అది ఇప్పుడు మునిగిపోతోందన్నారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్​సాగర్​రావు పదవిలో ఉన్నప్పుడు నస్పూర్​, మంచిర్యాలలో పేదలకు చెల్లని ఇండ్ల పట్టాలు ఇచ్చి మోసం చేశాడన్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో సంక్షేమం, అభివృద్ధికి పాటుపడే బీజేపీకి పట్టం కట్టాలని ఆయన కోరారు.

కార్యక్రమంలో నాయకులు పొనుగోటి రంగారావు, అందుగుల శ్రీనివాస్​, కొయ్యల ఏమాజీ, బొమ్మెన హరీశ్​గౌడ్​, రజినీశ్ జైన్​, పెద్దపల్లి పురుషోత్తం, అగల్​డ్యూటీ రాజు, డాక్టర్​ రఘునందన్​ తదితరులు పాల్గొన్నారు.