నస్పూర్, వెలుగు: మున్సిపాలిటి పరిధిలో బీజేపీ ఆఫీసును పార్టీ జిల్లా ఎన్నికల ఇన్చార్జి, మహారాష్ట్ర రాలేగావ్ ఎమ్మెల్యే అశోక్ రాంజీ ఉయికే, పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మండల నాయకులు, శక్తి కేంద్ర ఇన్చార్జిలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.
కార్యక్రమంలో పొనుగోటి రంగారావు, అగల్ డ్యూటీ రాజు, రజనీశ్ జైన్, రమేశ్, ఆనంద కృష్ణ, పనుగంటి మధు, మిట్టపల్లి మొగిలి, పాషా, ఈర్ల సాధనందం, సామ్రాజ్ రమేశ్, కొండ వెంకటేశ్, రానవేణి శ్రీను, మద్ది సుమన్, కొంతం మహేందర్, సిరికొండ రాజు, బుసరపు తిరుపతి, బద్రి శ్రీకాంత్, తడూరి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.