ఫుట్​బాల్​ సంఘం రాష్ట్ర జాయింట్ ​సెక్రటరీగా రాఘునాథ్​రెడ్డి

ఫుట్​బాల్​ సంఘం రాష్ట్ర జాయింట్  ​సెక్రటరీగా రాఘునాథ్​రెడ్డి

కోల్​బెల్ట్, వెలుగు: పీసీసీ స్టేట్​జనరల్​సెక్రటరీగా కొనసాగుతున్న రామకృష్ణాపూర్​ పట్టణానికి చెందిన కాంగ్రెస్​సీనియర్ లీడర్ ​పిన్నింటి రాఘునాథ్​రెడ్డి ఫుట్​బాల్​ అసోసియేషన్ ​రాష్ట్ర జాయింట్​సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఆదివారం నిజామాబాద్​లో జరిగిన రాష్ట్ర సంఘం నూతన కమిటీ ఎన్నికల్లో రాఘునాథ్ ​రెడ్డిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. 

ఆయన నాలుగేండ్ల పాటు జాయింట్​సెక్రటరీగా కొనసాగనున్నారు. జాతీయ స్థాయి ఫుట్​బాల్​క్రీడాకారుడైన రాఘునాథ్​రెడ్డి ఆదిలాబాద్​ఉమ్మడి జిల్లాలో జాతీయ, రాష్ట్రస్థాయి ఫుట్​బాల్​పోటీలను నిర్వహిస్తూ ఔత్సాహిక క్రీడాకారులను వెలికితీస్తూ ప్రోత్సహిస్తున్నారు.