మంచిర్యాల జిల్లా కేంద్రంలో రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మహిళలకు చీరల పంపిణీ చేశారు.
రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ద్వారా ప్రజలకు 5 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి తెలిపారు. ఈ ఫౌండేషన్ వల్ల ఎంతో మంది యువతి, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు. రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ను ప్రధాని మోదీ కల్పించారని గుర్తు చేశారు.
మహాత్మాగాంధీ జన్మదినం సందర్భంగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.