ఖమ్మం, వెలుగు: ఖమ్మం నియోజకవర్గంలోని ఏకైక మండలమైన రఘునాథపాలెంలో ముగ్గురు సర్పంచులు తరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు. సోమవారం సాయంత్రం మాజీ ఎంపీ పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వీరు మళ్లీ మంగళవారం మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
రఘునాథపాలెం మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు వీరునాయక్ ఆధ్వర్యంలో ఎన్ వీ బంజర సర్పంచ్ సక్రాం నాయక్, రజబ్ అలీ నగర్ సర్పంచ్ బోడ శరత్, మంగ్యాతండా సర్పంచ్ జీజా మత్రు, రజబ్ అలీ నగర్ ఉప సర్పంచ్ దంగుల నరసింహారావు, బొడ చిన్న బీఆర్ఎస్ లో చేరిన వారిలో ఉన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ నాయకత్వంలోనే పని చేస్తామని వారు తెలిపారు.