వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణమ రాజు వచ్చే ఎన్నికల్లో సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. విజయనగరం నుండి బీజేపీ తరఫున ఎంపీ టికెట్ ఆశించిన ఆయనకు నిరాశ ఎదురైంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు రఘురామ. తనకు విజయనగరం ఎంపీ టికెట్ ఇప్పించాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని, ఇప్పంచకపోతే ప్రజల్లో చంద్రబాబు మీద నమ్మకం పోతుందని, నాకు ఎంపీ టికెట్ ఇప్పంచలేని వాడు పోలవరం కడతాడా అని ప్రశ్నించాడు. రఘురామ వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి.
ఇదిలా ఉండగా రఘురామకు టీడీపీ నుండి అసెంబ్లీ టికెట్ కేటాయిస్తారని ప్రచారం ఊపందుకుంది. రఘురామ త్వరలోనే టీడీపీలో చేరనున్నారని, ఉండి నియోజకవర్గం నుండి ఆయనకు టికెట్ కేటాయిస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రఘురామ తాజా వ్యాఖ్యలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. ఒకవేళ రఘురామకు టీడీపీ అసెంబ్లీ టికెట్ ఇచ్చినా కూడా అంగీకరిస్తాడా లేదా అన్న అనుమానం కలుగుతోంది. ఆ మధ్య జరిగిన టీడీపీ, జనసేన జెండా సభలో కూటమి తరఫున పోటీ చేస్తానని తానే స్వయంగా ప్రకటించుకున్న రఘురామ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయటం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.