హాలియా, వెలుగు : నల్గొండ పార్లమెంట్ స్థానం కోసం నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన పీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘు వీర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తమ్ముడు సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో అప్లికేషన్ ఫామ్ అందజేశారు.
తన అన్న రఘువీర్ రెడ్డి తరఫున దరఖాస్తు చేసినట్లు ఆయన చెప్పారు. ఆయన వెంట పీసీసీ డెలిగేట్ జేజే సైదయ్య బాబు, రాష్ట్ర నాయకులు మిట్టపల్లి వెంకటేశ్, గడ్డంపల్లి వినయ్ రెడ్డి ఉన్నారు.