ఉప్మా ఎప్పుడూ చేసుకునేలా కాకుండా రాగి ఉప్మా చేసుకుంటే మరింత పోషకభరితంగా, ఆరోగ్యకరమైన అల్పాహారంగా మారుతుంది. రాగి ఉప్మా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. .
ఇప్పడు చాలామంది జనాలను షగర్ వ్యాధి వేధిస్తుంది. ఒకసారి ఈ వ్యాధి వచ్చిదంటే తగ్గడం అనేది ఉండదు. ఏ రోజు కారోజు కంట్రోల్ లో ఉంచుకోవాల్సిందే. అయితే షుగర్‌ను కంట్రోల్ చేసుకునేందుకు మిల్లెట్లతో తయారు చేసిన ఆహారాన్ని తింటుంటారు. అలాంటి మిల్లెట్లలో రాగులు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటాయి. రాగి జావ.. రాగి సంకటి.. రాగి ముద్ద( అన్నం) ఇలా అనేక రకాలుగా తయారు చేసుకుంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా రాగి దోశ, రాగి ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు. ఇవి కాకుండా రాగి ఉప్మా చేసుకోవచ్చు. రాగి రవ్వతో చేసుకునే అల్పాహారం, ఇది ఎంతో ఆరోగ్యకరమైనది. రాగి రవ్వతో ఉప్మా చేసుకుంటే అది మరింత ఆరోగ్యకరమైన అల్పాహారంగా మారుతుంది.
రాగి ఉప్మా తయారీకి కావలసిన పదార్దాలు
- 1 కప్పు రాగి రవ్వ
- 3 కప్పుల నీరు
- 2 టేబుల్ స్పూన్ల నూనె / నెయ్యి
- 1 ఉల్లిపాయ
- 1 tsp అల్లం
- 2 పచ్చి మిరపకాయలు
- 1 చిటికెడు ఇంగువ
- 1/2 టీస్పూన్ స్పూన్ ఆవాలు
- 1/2 టీస్పూన్ టీస్పూన్ జీలకర్ర
- 3 టేబుల్ స్పూన్లు వేరుశెనగ
- 2 టీస్పూన్ చనా పప్పు
- 2 స్పూన్ మినపపప్పు
- 1 రెమ్మ కరివేపాకు
- ఉప్పు రుచికి తగినంత
- నిమ్మకాయ
- కొత్తిమీర
రాగి ఉప్మా తయారీ విధానం
- ముందుగా రాగి రవ్వను కడిగి కొన్ని నిమిషాలు నానబెట్టండి. అనంతరం నీటిని పూర్తిగా తీసేసి, పక్కన పెట్టండి.
- బాణలిలో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు వేయండి. ఆ తర్వాత శనగపప్పు, మినపపప్పు, వేరుశనగలు వేసి రంగు మారే వరకు వేయించాలి.
- ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం, ఇంగువ, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
- అనంతరం రాగి రవ్వను వేసి 3 నుండి 4 నిమిషాల పాటు వేయించాలి.
- ఇప్పుడు కొద్దిగా ఉప్పు, నీరు వేసి బాగా కలపండి, మరిగించండి. మూతపెట్టి తక్కువ నుండి మీడియం మంట మీద ఉడికించాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి.
- చివరగా కొత్తిమీర, నిమ్మరసం చల్లుకోవాలి.
- అంతే, రాగి ఉప్మా రెడీ.. వేడివేడిగా ఆరగించండి.
- సాధారణంగా రవ్వ త్వరగా ఉడుకుతుంది. కానీ రాగుల పిండి వండడానికి చాలా సమయం పడుతుంది. మూతపెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వండి.
- 5 నిమిషాల తర్వాత మూత తెరిచి కలపాలి. తర్వాత మళ్లీ మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వండి. అంతే రాగి ఉప్మా రెడీ అయిపోయినట్టే. బ్రేక్ ఫాస్ట్ తినేయెుచ్చు
మన ఆరోగ్యాన్ని పెంపొందించే అద్భుతమైన మిల్లెట్లలో రాగులు కూడా ఒకటి. వీటిలో అధిక ప్రోటీన్ ఉంటుంది, మధుమేహం సమస్య ఉన్నవారికి మంచి ఆహారం, అలాగే జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, సహజంగా బరువు తగ్గించే ఏజెంట్లు ఉన్నాయి. వృద్ధాప్య సంకేతాలు దూరం చేసి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ, జుట్టు పెరుగుదలకు కూడా రాగులు మంచివి. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. బలమైన ఎముకలకు ఇది అవసరం, అందుకే రాగి వంటకాలు చాలా బలవర్ధకమైన ఆహారంగా చెప్తారు. తల్లి పాల ఉత్పత్తిని కూడా పెంచడానికి కూడా ఇది మంచి సూపర్ ఫుడ్... మరి ఇలాంటి ఫుడ్ ను వారానికి రెండు సార్లు తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు.