
రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం లీడ్ రోల్స్‌లో కోమల్ ఆర్ భరద్వాజ్ తెరకెక్కించిన చిత్రం ‘రహస్యం ఇదం జగత్’. పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మించారు. నవంబర్ 8న సినిమా విడుదల. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్. మన దేశానికి చెందిన శ్రీ చక్రాన్ని అన్వేషిస్తూ అమెరికాలో తవ్వకాలు జరపడం నన్ను ఇన్‌స్పైర్ చేసింది. అలాగే సైన్స్ ప్రకారం వామ్ హోల్ కాన్సెప్ట్‌తో ఇంకో టైమ్‌లోకి ట్రావెల్ కావొచ్చు. పురాణాల్లోనూ ఇవి రాశారు. వీటన్నింటికీ ఫిక్షన్‌ను జోడించి ఆసక్తికరంగా తెరకెక్కించా. ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యే చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. ఇలాంటి కథలకు కొత్తవాళ్లతో తీస్తేనే ఎక్కువ థ్రిల్ ఉంటుందని భావించాం. అందరూ చాలా బాగా నటించారు. భవిష్యత్తులో కూడా ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఇలాంటి కథలతోనే సినిమా చేస్తాను’ అని చెప్పాడు.