భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ రికార్డు ప్రమాదంలో పడింది. భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో సచిన్ అత్యధిక పరుగులు చేశాడు. టెండూల్కర్ ఇప్పటివరకు తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 136.66 సగటుతో 820 పరుగులు చేశాడు. వీటిలో ఐదు సెంచరీలు ఉన్నాయి. ఈ రికార్డ్ బంగ్లాదేశ్ సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ బ్రేక్ చేసే అవకాశం ఉంది.
ALSO READ | Danish Kaneria: పాకిస్థాన్ జట్టుకు గంభీర్ కోచింగ్ అవసరం: మాజీ స్పిన్నర్ కనేరియా
రహీం భారత్ పై ఇప్పటివరకు 15 ఇన్నింగ్స్‌ల్లో 43.14 సగటుతో 604 పరుగులు చేశాడు. వీటిలో రెండు అర్ధ సెంచరీలు.. ఒక సెంచరీ ఉన్నాయి. రహీం మరో 217 పరుగులు చేస్తే సచిన్ రికార్డ్ బద్దలు కొడతాడు. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో రహీం తర్వాత ఈ లిస్టులో విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లి ఇప్పటివరకు తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 54.62 సగటుతో 437 పరుగులు చేశాడు. సచిన్ రికార్డ్ బ్రేక్ చేయాలంటే కోహ్లీ రెండు టెస్టుల్లో 384 పరుగులు చేయాల్సి ఉంది. ఇది దాదాపు అసాధ్యంగానే కనిపిస్తుంది.
రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఈ నెల 19 నుంచి చెన్నైలో తొలి మ్యాచ్, సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు కాన్పూర్‌లో రెండో టెస్ట్ జరగనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్స్ టేబుల్ లో భారత్ 68.52 శాతం విజయాలతో అగ్ర స్థానంలో కొనసాగుతుంది.మరోవైపు బంగ్లాదేశ్ పాకిస్థాన్ పై క్లీన్ స్వీప్ చేసిన తర్వాత 45.83 శాతంతో నాలుగో స్థానానికి చేరుకుంది.టెస్ట్ ఛాంపియన్ లో భాగంగా ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకంగా మారింది.