కాంగ్రెస్ ఖిల్లాల్లో ఓటర్ ఎటు సైడో?

అమేథీలో రాహుల్ పట్టు నిలిచేనా?

యూపీలో కాంగ్రెస్‌‌కి మరో కంచుకోట అమేథీ. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి పోటీలో ఉన్నారు . గడచిన 13 ఎన్నికల్లో రెండుసార్లు మాత్రమే ఇతర పార్టీలవారు నెగ్గారు. 1980లో సంజయ్‌ గాంధీ మొదట నెగ్గింది ఇక్కడే. ఆ తర్వా త రాజీవ్‌గాంధీ నాలుగుసార్లు, రాహుల్‌‌ గాంధీ మూడుసార్లు అమేథీ నుంచే గెలిచారు. ఒకే సీటు నుంచి బాబాయి, తండ్రి, తల్లి గెలవడాన్నిబట్టి అమేథీపై కాంగ్రెస్‌‌ ప్రభావాన్ని అంచనా వేయొచ్చు.అయితే, 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అమేథీ పరిధిలోని 5 సీట్లలో ఒక్కచోట-యినా కాంగ్రెస్‌‌ గెలవలేకపోయింది. నాలుగింటిని బీజేపీ దక్కిం చుకోగా, గౌరీగంజ్‌‌ అసెంబ్లీసీటును సమాజ్‌‌వాది పార్టీ సొంతం చేసుకుంది. ఈ పరిణామాలు బీజేపీకి మంచి ఉత్సాహాన్నిస్తు-న్నాయి. అమేథీలో పోయిన ఎన్నికల్లో రాహుల్‌‌ చేతిలో ఓటమిపాలైన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీమరోసారి పోటీకి దిగారు. దేశ రాజకీయాల్లో దక్షిణాదికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో కేరళ-లోని వయనాడ్ నుంచి కూడా రాహుల్‌‌ పోటీకి దిగారు. ఇదే విషయాన్ని స్మృతి టార్గెట్‌‌ చేశారు.అమేథీలో ఓడిపోతానన్న భయంతోనే రాహుల్ వయనాడ్‌‌కి పారిపోయారని ప్రచారం చేశారు.ఎస్‌‌పీ, బీఎస్‌‌పీ కూటమి యూపీలో వదిలేసిన రెండో సీటు అమేథీయే. ఇక్కడ కూడా ప్రధాన పోటీకాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉంది. ఇక్కడ మొత్తం ఓటర్లు 16,69,843 ఉన్నారు .

రాయ్ బరేలీ.. వాళ్ల ఫ్యామిలీదే

దేశంలోనే రాయ్‌ బరేలీ లోక్‌‌సభ సెగ్మెంట్‌‌కి ఒక ప్రత్యేకత ఉంది. ఇందిరా గాంధీ కుటుంబానికి ఈ సెగ్మెంట్ పెట్టని కోట. గత 19 ఎన్నికల్లో మూడుసార్లు మాత్రమే కాంగ్రెస్‌‌ ఓడిపోయింది. 1957లో ఇక్కడి నుంచి ఇందిర భర్త ఫిరోజ్ గాంధీ గెలిచారు. తర్వా త1967, 1971లో ఇక్కడి నుంచి ఇందిర విజయం సాధించారు. అప్పటి వరకు ప్రధానిగా పనిచేసిన ఇందిర 1977 ఎన్నికల్లో జనతాపార్టీ కేండిడేట్ రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయారు. తర్వాత 1980లో మళ్లీ కాంగ్రెస్ గెలిచింది. 2004 నుంచి వరుసగా సోని యాగాంధీ ఇక్కడి నుంచే లోక్‌‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు . ఈసారి సోని యాపైబీజేపీ తరఫున దినేష్ ప్రతాప్ సింగ్ పోటీలోఉన్నారు . దినేష్ గతంలో కాంగ్రెస్‌‌లో పనిచేసిన లీడరే. రాయ్ బరేలీ సెగ్మెంట్‌‌లో ఐదు అసెంబ్లీ స్థానాలున్నాయి. ఓటర్లలో 15 శాతంమంది ముస్లింలు, ఆ తర్వా త పెద్ద సంఖ్యలోబ్రాహ్మణులు ఉన్నారు . వీరితోపాటు క్షత్రియులు, ‘పాసి’ కులస్తులు కూడా ఎక్కువగానేఉన్నారు . మొత్తం ఓటర్లు15,94,954 కాగా,మహిళ ఓటర్లు 7,37,079, మగ ఓటర్లు8,57,875 మంది ఉన్నారు . ఇక్కడ ఎస్‌‌పీ,బీఎస్‌‌పీ కూటమి కేండి డేట్‌‌ లేకపోవడంతోకాంగ్రెస్, బీజేపీ మధ్యనే ముఖాముఖీ పోటీనెలకొంది