
న్యూఢిల్లీ: హైదరాబాద్‌తో మ్యాచ్ ఓడిన తర్వాత లక్నో ప్లే ఆఫ్స్ ఆశలు సన్నగిల్లడంతో కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అదే టైమ్‌లో ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా వ్యవహారశైలి కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రాబోయే రెండు మ్యాచ్‌ల్లో రాహుల్‌ను కెప్టెన్‌గా కొనసాగిస్తారా? అన్న చర్చ మొదలైంది. బ్యాటింగ్‌పై ఫోకస్ చేసేందుకు కేఎల్ కెప్టెన్సీకి దూరంగా ఉండబోతున్నాడని వార్తలు వచ్చాయి. దాంతో పాటు గోయెంకా ప్రవర్తనకు రాహుల్ నొచ్చుకున్నట్లు సమాచారం. ‘లక్నో తమ తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 14న ఢిల్లీతో ఆడనుంది. దాదాపు ఐదు రోజుల విరామం వచ్చింది. కాబట్టి కెప్టెన్సీపై ఎలాంటి నిర్ణయం రాలేదు. కాకపోతే బ్యాటింగ్‌పై ఏకాగ్రత కోసం రాహుల్ సారథ్యం వద్దనుకుంటున్నాడు. అయితే మేనేజ్‌మెంట్ ఎలాంటి ఆలోచన చేస్తుందో తెలియదు’ అని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.