ఒమన్ వేదికగా జరుగుతోన్న ఎమర్జింగ్ ఆసియాకప్ లో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్లు.. భారత్ ఎదుట 207 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఛేదనలో భారత్ ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. విజయానికి చివరి 42 బంతుల్లో ఇంకా 106 పరుగులు కావాలి. ఇది దాదాపు అసంభవం.
ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ స్టార్, భారత యువ బౌలర్ రాహుల్ చాహర్ చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు. ఒక ఓవర్‌లో 31 పరుగులు సమర్పించుకొని ఇండియా- ఏ తరుపున అత్యంత చెత్త గణంకాలు నమోదు చేసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఐపీఎల్ హీరో టీమిండియా అగ్రజట్టు తరఫున 2021లో టీ20 ప్రపంచకప్ ఆడటం గమనార్హం. 13వ ఓవర్ వేయటానికి బంతిని చేతికందుకున్న చాహర్.. రెండు నో బాల్స్ సహా మొత్తంగా 8 బంతులేశాడు. 12 ఓవర్లకు ఆఫ్గనిస్తాన్ స్కోర్ 104 పరుగులుండగా.. 13 ఓవర్ ముగిసేసరికి ఏకంగా 135 పరుగులకు చేరుకుంది. చివరకు 20 ఓవర్లలో ఆఫ్ఘనిస్థాన్ 206 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ALSO READ | Mohammad Shami: భారత జట్టుకు గుడ్‌న్యూస్.. షమీ వచ్చేస్తున్నాడు
ఇండియా- ఏ తరుపున అత్యంత ఖరీదైన స్పెల్‌లు
- రాహుల్ చాహర్: AFG A vs 3 ఓవర్లలో 48 పరుగులు
- ఆకిబ్ ఖాన్: AFG A vs 4 ఓవర్లలో 48 పరుగులు
- అన్షుల్ కాంబోజ్: AFG A vs 3 ఓవర్లలో 40 పరుగులు
- రాహుల్ చాహర్: UAE vs 4 ఓవర్లలో 38 పరుగులు
- ఆకిబ్ ఖాన్: ఒమన్ వర్సెస్ 4 ఓవర్లలో 38 పరుగులు
Sediqullah hit two birds with ZERO stones! ⚡@ACBofficials #MensT20EmergingTeamsAsiaCup2024 #INDvAFG #ACC pic.twitter.com/MNdGmFiNgb
— AsianCricketCouncil (@ACCMedia1) October 25, 2024