
న్యూఢిల్లీ: ఓబీసీ వర్గాలకు చెందిన నైపుణ్యం కలిగిన పనివాళ్లు టెక్స్‌టైల్ రంగంలో పెద్దగా రాణించలేకపోతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ నిర్లక్ష్యపూరితమైన, అన్యాయమైన విష వలయన్ని ఛేదించడానికి తాను పోరాడుతున్నానని తెలిపారు. శనివారం రాహుల్ గాంధీ ‘ఎక్స్’ లో ఒక పోస్ట్ పెట్టారు. టెక్స్ టైల్ కార్మికుడి వర్క్ షాప్ ను సందర్శించిన వీడియోను ఆయన షేర్ చేశారు.
‘‘టెక్స్ టైల్ఇండస్ట్రీలో ఒక ఓబీసీని ఉన్నతస్థానంలో చూడలేదని విక్కీ అనే వ్యక్తి నాకు చెప్పాడు. అతడి ఫ్యాక్టరీలోని పనివాళ్లు రోజుకు 12 గంటలు కష్టపడి పని చేస్తారు. కానీ, వారి నైపుణ్యానికి గుర్తింపు లేదు. ఇతర ఇండస్ట్రీల మాదిరిగానే.. టెక్స్‌టైల్, ఫ్యాషన్ రంగంలో బహుజనులకు ప్రాతినిధ్యం లేదు” అని పేర్కొన్నారు.