IPL 2025: పుకార్లకు చెక్: బెంగళూరు కాదు.. లక్నోతోనే రాహుల్

IPL 2025: పుకార్లకు చెక్: బెంగళూరు కాదు.. లక్నోతోనే రాహుల్

ఐపీఎల్ 2025 లో కేఎల్ రాహుల్ రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు వస్తున్నాడనే పుకార్లు కొన్ని నెలల నుంచి వైరల్ గా మారాయి. లక్నో యాజమాన్యంతో అతనికి మంచి సంబంధాలు లేవని.. రాహుల్ తన సొంత నగరమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో కలవనున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ పుకార్లని తేలింది. సోమవారం (ఆగస్టు 26) కోల్ కతాలో సంజీవ్ గోయెంకాను రాహుల్  కలిశాడు. అతనితో కలిసి ఆత్మీయంగా మాట్లాడడం ఫొటోలో కనిపిస్తుంది. 

Also Read:-విండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దే టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గోయెంకాతో కలిసి రాహుల్ చాలా సేపు చర్చలు జరిపినట్టు సమాచారం. దీంతో రాహుల్ ఆర్సీబీ జట్టుకు వెళ్తున్నాడనే వార్తలకు దాదాపుగా చెక్ పడింది. లక్నోతోనే రాహుల్ కొనసాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. లక్నో యాజమాన్యం సైతం రాహుల్ ను జట్టుతోనే ఉంచడానికి ఆసక్తి చూపుతోందట. ఐపీఎల్ రిటైన్ చేసుకునే ప్లేయర్ల లిస్ట్ త్వరలో రానుంది. 2025 లో ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది. దీని ప్రకారం జట్టు నలుగురు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకోవాల్సి ఉంది. 

అసలేం జరిగిందంటే..?

ఐపీఎల్ 17లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జేయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కు ఛేదు అనుభవం ఎదురైంది. మే 9వ తేదీ బుధవారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ పై లక్నో సూపర్ జేయింట్స్ 10 వికెట్ల తేడాతో ఘోరంగా పరాజయం పాలైంది.  

ఓటమి అనంతరం రాహుల్ వద్దకు వచ్చిన సంజీవ్.. ఏం ఆటయ్యా అది.. బౌలర్లు, ఫీల్డర్లను సరిగా ఉపయోగించుకోకుండా చెత్త కెప్టెన్సీ చేస్తున్నావ్  అంటూ తిడుతున్నట్లు..  గ్రౌండ్ లోనే అతనిపై అసహనంతో ఊగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాహుల్ ఎదో చెప్పేందుకు ప్రయత్నించినా సంజీవ్ వినిపించుకోకుండా రాహుల్ పై కోపడ్డాడు. సంజీవ్ మాట్లాడేటప్పుడు.. రాహుల్ చాలా అసౌకర్యంగా ఫీలైనట్లు వీడియోలో కనిపించింది.