టీమిండియా ది వాల్, మిస్టర్ డిపెండబుల్ గా పేరొందిన రాహుల్ ద్రవిడ్ భారత క్రికెట్ కు ఎన్నో సేవలను అందించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ గా భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా టెస్టు, వన్డే ఫార్మాట్ లో బౌలర్లకు సవాలుగా నిలుస్తూ అడ్డుగోడల నిలబడేవాడు. అయితే ఎన్ని విజయాలు సాధించినా అతని ఖాతాలో ఐసీసీ ట్రోఫీ లేని వెలితి అలాగే ఉంది. అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసినప్పటినుంచి ఐసీసీ ట్రోఫీ అతనికి అందని ద్రాక్షాలాగే మిగిలిపోయింది. అయితే ప్లేయర్ గా, కెప్టెన్ గా అందుకోలేని వరల్డ్ కప్ ను కోచ్ గా సాధించాడు.
క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ద్రవిడ్ టీమిండియాకు సేవలను అందిస్తూనే ఉన్నాడు. యువ ప్లేయర్లను చక్కని మెళకువలు నేర్పుతూ వారి కెరీర్ ఉన్నత స్థాయికి చేరడంలో సక్సెస్ అయ్యాడు. 2021 నవంబర్ లో భారత ప్రధాన కోచ్ గా ద్రవిడ్ అడుగుపెట్టాడు. తన రెండున్నరేళ్ల ప్రయాణంలో భారత్ 2022 సెమీస్ కు చేరింది. 2023 లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకొని తుది మెట్టుపై ఆస్ట్రేలియాపై బోల్తా పడింది. ఇక టీ20 వరల్డ్ కప్ 2024 తన కెరీర్ లో చివరిదని ప్రకటించిన తర్వాత భారత్ వరల్డ్ కప్ నెగ్గింది.
వెస్టిండీస్ లోని బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాపై జరిగిన ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి 17 ఏళ్ళ తర్వాత టీ 20 వరల్డ్ కప్ అందుకుంది. టోర్నీ అంతటా అద్భుతంగా ఆడి ద్రవిడ్ కు గొప్ప ముగింపు పలికారు. దీంతో ద్రవిడ్ డ్రెస్సింగ్ రూమ్ లో కాస్త ఎమోషనల్ అయ్యాడు. చివరిసారిగా ఆటగాళ్లతో మాట్లాడాడు. "నిజం చెప్పాలంటే ఏం మాట్లాడాలో నాకు అర్ధం కావడం లేదు. మన జీవితకాలంలో ఈ క్షణాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ఇంత గొప్ప విజయం అందించిన ప్రతి ఒక్కరి థ్యాంక్యూ. ఎన్నో త్యాగాలు చేసి.. మీరంతా ఇంత దూరం వచ్చారు. మన కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది". అని ద్రవిడ్ ఎమోషల్ అయ్యాడు.
#ThankYouDravid
— Cricketopia (@CricketopiaCom) July 2, 2024
Watch the ever so inspiring Rahul Dravid’s farewell speech at the coach of Team India.
pic.twitter.com/wZQG2fmN5v