![ద్రవిడ్‌తో పని చేయడానికి ఎదురు చూస్తున్నా](https://static.v6velugu.com/uploads/2021/11/Rahul-Dravid-a-stalwart-of-Indian-cricket,-will-be-nice-working-with-him-Rohit-Sharma-on-new-head-coach_PT3dWto0LX.jpg)
వెటరన్ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్ టీమిండియాకు కొత్త కోచ్‌గా నియమితుడయ్యాడు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత స్వదేశంలో జరిగే న్యూజిలాండ్ సిరీస్ నుంచి కోచ్‌గా ద్రవిడ్ పగ్గాలు చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలను చేపట్టనుండటంపై హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ స్పందించాడు. ద్రవిడ్‌కు కంగ్రాట్స్ చెప్పిన రోహిత్.. ఆయనతో కలసి పని చేయడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు. ఆయన లాంటి దిగ్గజ ప్లేయర్‌తో భవిష్యత్‌లో పని చేయడాన్ని ఆస్వాదిస్తామని అన్నాడు. ద్రవిడ్ మార్గదర్శకత్వంలో భారత జట్టు కొత్త దిశగా దూసుకెళ్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. కాగా, బీసీసీఐ తనను కోచ్‌గా నియమించడంపై రాహుల్ ద్రవిడ్ హర్షం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఉన్న కోచ్ రవిశాస్త్రి హయాంలో భారత జట్టు అద్భుతమైన విజయాలను సాధించిందని కొనియాడాడు. ఇదే విజయపరంపరను ఆటగాళ్లందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశాడు.