Paris Olympics 2024 hockey: అర్జెంటీనాతో భారత్ ఢీ.. మ్యాచ్‌కు హాజరైన రాహుల్ ద్రవిడ్

Paris Olympics 2024 hockey: అర్జెంటీనాతో భారత్ ఢీ.. మ్యాచ్‌కు హాజరైన రాహుల్ ద్రవిడ్

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ మరో కీలక మ్యాచ్ కు సిద్ధమవుతుంది. పూల్ 'బి' లో భాగంగా అర్జెంటీనాతో మ్యాచ్ ఆడుతుంది. పటిష్టమైన అర్జెంటీనా మీద మ్యాచ్ గెలిస్తే భారత్ సెమీ ఫైనల్ అవకాశాలు మెరుగవుతాయి. ఈ పూల్ లో ఆడిన రెండు మ్యాచ్ ల్లో గెలిచి బెల్జియం టాప్ లో ఉంది. భారత్ ఆడిన ఒక మ్యాచ్ లో గెలిస్తే.. బెల్జియం ఆడిన తొలి మ్యాచ్ లో ఓడిపోయింది. ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ చూసేందుకు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రావడం విశేషం. స్పెషల్ గ్యాలరీలో కూర్చొని మ్యాచ్ చూస్తున్నాడు.

తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై గ్రాండ్ విక్టరీ సాధించిన ఇండియా శుభారంభం చేసింది. 3-2 తేడాతో న్యూజిలాండ్ ను ఓడించింది. హర్మన్ ప్రీత్  సింగ్  రెండు గోల్స్ చేశాడు. రూపిందర్  పాల్  సింగ్  మొదటి గోల్  సాధించాడు. మ్యాచ్  మొదలైన ఆరో నిమిషంలోనే న్యూజిలాండ్  1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆ తర్వాత జోరు పెంచిన స్కోర్ ను సమం చేసి చివరకు విజయం సాధించింది. భారత్ తో పాటు ఐర్లాండ్, బెల్జియం, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు పూల్ బి లో ఉన్నాయి. 

పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టుపై చాలా అంచనాలు ఉన్నాయి. వరుసగా రెండో సారి పతకం తీసుకురావాలని దేశమంతటా కోరుకుంటుంది. అయితే పతకం రావాలంటే మాత్రం తీవ్రంగా చెమటోడ్చాల్సిందే. 1984 ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి 2016  రియో గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకూ ప్రతీసారి ఒట్టి చేతులతోనే తిరిగొచ్చిన హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం అద్భుతం చేసింది. అంచనాలను తలకిందులు చేస్తూ బ్రాంజ్ అందుకుంది.