Rahul Dravid: నా బయోపిక్‌లో నేనే నటిస్తా.. టీమిండియా దిగ్గజ క్రికెటర్

టీమిండియా ది వాల్, మిస్టర్ డిపెండబుల్ గా పేరొందిన రాహుల్ ద్రవిడ్ భారత క్రికెట్ కు ఎన్నో సేవలను అందించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ గా భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా టెస్టు, వన్డే ఫార్మాట్ లో బౌలర్లకు సవాలుగా నిలుస్తూ అడ్డుగోడల నిలబడేవాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా.. యువ క్రికెటర్లకు కోచింగ్ ఇస్తూ వారిని టీమిండియా భవిష్యత్ క్రికెటర్లుగా మార్చాడు. భారత జట్టు ప్రధాన కోచ్ గా తన ప్రయాణాన్ని విజయవంతంగా ముగించాడు. ఎన్నో అద్భుత క్షణాలు ఉన్న ద్రవిడ్ బయోపిక్ చర్చకు వచ్చింది.

Also Read:- డ్రీమ్ 11 డేటా సోర్స్ హ్యాకర్ అరెస్ట్         

బుధవారం (ఆగస్టు 21) సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డులను నిర్వహించింది. ఆ ఫంక్షన్ లో కెప్టెన్‌.. కోచ్‌గా భారత క్రికెట్‌కు చేసిన కృషికి టీమిండియా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌ను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డు అందజేసిన తర్వాత ద్రవిడ్ ను మీ బయోపిక్‌లో ఎవరు నటిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు అని అడిగారు.  దీనికి ద్రవిడ్ డబ్బు ఎక్కువగా ఉంటే నేనే నటించటానికి సిద్ధంగా ఉన్నాను. అని నవ్వుతూ సమాధానం చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

ఈ వేడుకలో ప్రస్తుత భారత జట్టు గురించి మాట్లాడాడు. రాబోయే రోజుల్లో కూడా టీమిండియా విజయాల జోరును కంటిన్యూ చేస్తుందన్నాడు. ప్రస్తుతం ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లు భయం లేకుండా మంచి ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నారని కితాబిచ్చాడు. యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఇండియాలో ఉన్నాయని ద్రవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పాడు. వాటిని సరైన రీతిలో ఉపయోగించుకోవాలని సూచించాడు.