ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ అంటే చాలు అందరికీ బజ్ బాల్ విధానమే గుర్తుకొస్తుంది. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ కు భిన్నంగా ఆడుతూ వేగంగా పరుగులు చేయడమే ఈ బజ్ బాల్. మెక్కలం కోచ్ అయిన దగ్గర నుంచి ఇంగ్లండ్ ఈ విధానాన్ని అనుసరిస్తుంది. ప్రత్యర్థి ఎవరైనా ఇంగ్లండ్ తమ బజ్ బాల్ రుచి అన్ని జట్లకూ చూపిస్తుంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రత్యర్థి బౌలింగ్ ను అటాకింగ్ చేస్తూ ఒత్తిడిలో పడేసే ప్రయత్నం చేస్తారు. గురువారం(జనవరి 25) నుంచి భారత్ తో సిరీస్ ప్రారంభ కానుంది.
ఐదు టెస్టుల ఈ సిరీస్ లో కూడా ఇంగ్లండ్ బజ్ బాల్ గేమ్ ఆడుతుందని ఇప్పటికే కోచ్ మెక్కలం, కెప్టెన్ బెన్ స్టోక్స్ భారత్ కు హెచ్చరికలు పంపారు. భారత్ లాంటి పిచ్ లపై అటాకింగ్ గేమ్ ప్రమాదకరమైన ఆ జట్టు ఏ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ఇదే విషయంపై విలేకర్లు భారత్ కూడా ఇంగ్లాండ్ మాదిరిగా బజ్ బాల్ క్రికెట్ ఆడుతుందా.? అనే ప్రశ్న ఎదురైంది. హైదరాబాద్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో ఈ ప్రశ్నకు భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు.
భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్ లా ఆడరు. అలాగని మా వాళ్ళు వెనకడుగు వేయరు. పరిస్థితులకు తగ్గట్టుగానే భారత ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తారని చెప్పుకొచ్చాడు. మా టాప్ ఏడుగురు బ్యాట్స్‌మెన్‌లను గమనిస్తే.. చాలా మంది కుర్రాళ్ళు సహజంగానే బ్యాటింగ్ చేస్తారు. కొన్ని సార్లు గేమ్ ను ముందుకు తీసుకు వెళ్ళడానికి ఎక్కవ సమయం బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అటాకింగ్ చేయాలనే ఆలోచన మాకు లేదు. సానుకూలంగానే బ్యాటింగ్ చేస్తామని.. ద్రవిడ్ అన్నారు.
ఈ సందర్భంగా 2022లో పాకిస్తాన్‌లో ఇంగ్లండ్ పర్యటించినప్పుడు సిరీస్ గెలిచిందనే విషయం గుర్తు చేసాడు. ఆసియా పిచ్ ల మీద ఇంగ్లాండ్ అటాకింగ్ చేసి సఫలమైందని.. స్వదేశంలో పాక్ జట్టును 3-0 తేడాతో ఓడించందని తెలియజేసాడు. భారత్ లో టెస్ట్ సిరీస్ గెలవటం చాలా కష్టమని ద్రవిడ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇవన్నీ పక్కన పెడితే చివరిసారిగా భారత్ స్వదేశంలో 2012 లో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఓడిపోయింది.