Rahul Dravid: ఇంగ్లాండ్‌కు సంగక్కర.. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్

Rahul Dravid: ఇంగ్లాండ్‌కు సంగక్కర.. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ను రాజస్థాన్ రాయల్స్ మెంటార్ గా నియమించుకోవాలనే వచ్చిన వార్తలు బలపడుతున్నాయి. ఇప్పటికే ఈ భారత మాజీ క్రికెటర్ తో రాజస్థాన్ ఫ్రాంచైజీ చర్చలు జరిపినట్టు సమాచారం. ద్రవిడ్ కూడా ఆసక్తిగా ఉండడంతో రాజస్థాన్ రాయల్స్‌ జట్టు మెంటార్ గా వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. శ్రీలంక లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ కుమార సంగక్కర స్థానంలో ద్రవిడ్ ను ఎంపిక చేయనున్నారని నివేదికలు చెబుతున్నాయి.   

ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ మెంటార్ గా సంగక్కర ఉన్నాడు. అతను త్వరలో ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఐపీఎల్ లో జోస్ బట్లర్‌తో అతనికున్న బలమైన సంబంధాల కారణంగా సంగక్కర పేరు తెరమీదకు వచ్చింది. ఇప్పటికే అతని పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) అధికారిక ప్రకటన చేయనుందని సమాచారం. ఇంగ్లండ్ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ హెడ్ కోచ్‌ బాధ్యతల నుంచి మాథ్యూ మోట్ తప్పుకోగా.. అతని స్థానంలో తాత్కాలిక కోచ్‌గా ఆ జట్టు మాజీ క్రికెటర్ మార్కస్ ట్రెస్కోథిక్‌ను నియమించింది.

ద్రవిడ్ కు రాజస్థాన్ రాయల్స్ కు మధ్య చక్కని అనుబంధం ఉంది. రాజస్థాన్ రాయల్స్ తరపున కెప్టెన్ గా ఆడిన ఈ మాజీ భారత ప్లేయర్.. 2013లో ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ కు జట్టును ఫైనల్ కు చేర్చాడు. 2014, 2015లో రాజస్థాన్ జట్టు మెంటార్ గా ఉన్నాడు. ఆ తర్వాత టీమిండియా అండర్ 19 జట్టుకు కోచింగ్ ఇవ్వడం.. నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్ అయ్యాడు. నవంబర్ 2021లో రవిశాస్త్రి స్థానంలో టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.