
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్, ద్రవిడ్ మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ సందర్భంగా సంజు శాంసన్ ను సంప్రదించకుండానే సూపర్ ఓవర్ లో ఎవరిని దించాలో నిర్ణయించినట్టు టాక్. జట్టులో శాంసన్ కంటే ద్రవిడ్ ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నాడని కొంతమంది ఆరోపించారు. అయితే ఈ పుకార్లను ఆ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తీవ్రంగా ఖండించారు.
శనివారం (ఏప్రిల్ 19) లక్నో సూపర్ జయింట్స్ తో జరగబోయే మ్యాచ్ కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో ద్రవిడ్ మాట్లాడారు. శాంసన్, ఫ్రాంచైజీకి మధ్య వస్తున్న వార్తలు "నిరాధారమైనవి" అని తెలిపారు. ప్లేఆఫ్ స్థానం కోసం జట్టు ఐక్యంగా ఉందని ఆయన తెలిపారు. సంజు సామ్సన్ జట్టు సమావేశంలో పాల్గొనడం లేదని, అక్కడ ద్రవిడ్ సహాయక సిబ్బందితో కొంతమంది ఆటగాళ్లతో చర్చలు జరుపుతున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతున్న తరుణంలో ఈ ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. "ఈ నివేదికలు ఎక్కడి నుండి వస్తున్నాయో నాకు తెలియదు. సంజు మరియు నేను ఒకే మాట మీద ఉన్నాము" అని ద్రవిడ్ అన్నాడు.
Also Read:-సిక్సర్లలో రాహులే కింగ్.. ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఇండియన్ బ్యాటర్‌గా కేఎల్ రికార్డ్
రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ కు సిద్ధమవుతుంది. శనివారం (ఏప్రిల్ 19) లక్నో సూపర్ జయింట్స్ తో అమీ తుమీ తేల్చుకోనుంది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ ల్లో రాజస్థాన్ కేవలం రెండు మాత్రమే గెలిచింది. నేడు జరగనున్న మ్యాచ్ లో ఓడిపోతే ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టం అవుతాయి. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఆడతాడా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తూ గాయం కారణంగా మధ్యలోనే రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.
Rahul Dravid clarified all the social media reports are wrong in the Press Conference.
— Johns. (@CricCrazyJohns) April 19, 2025
- Sanju 🫂 Dravid. pic.twitter.com/WdIvWX3HgF