ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గాయం కారణంగా వరల్డ్ కప్ మొత్తానికి దూరమవడంతో ఇప్పుడు టీమిండియాకు ఆరో బౌలర్ సమస్య వచ్చి చేరింది. జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్నప్పటికీ ఆరో బౌలర్ లేకపోతే కొన్ని సార్లు మ్యాచ్ ఓడిపోయినా ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదు. ఒక బౌలర్ భారీగా పరుగులు సమర్పించుకున్నా, గాయం కారణంగా మధ్యలోనే మైదానాన్ని వీడినా ఆరో బౌలర్ లేని కొరత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయంపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వరల్డ్ కప్ లో భాగంగా నేడు(నవంబర్ 5) టీమిండియా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడనుంది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఈ మ్యాచ్ కు ముందు ఆరోబౌలర్ గురించి రాహుల్ ద్రావిడ్‌ను ఓ విలేకరి ప్రశ్నించాడు. దీనికి ద్రావిడ్ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. కోహ్లీ ఆ బాధ్యత చూసుకుంటాడంటూ పరోక్షంగా చెప్పుకొచ్చాడు. ద్రావిడ్ మాట్లాడుతూ.. మాకు ఆరో బౌలింగ్ ఆప్షన్ లేదు. కానీ మా వద్ద రాంగ్ ఫూటెడ్ ఇన్‌స్వింగర్ ఉన్నాడు. కొన్ని ఓవర్లు అతను బౌలింగ్ చేస్తాడు. శ్రీలంకపై మ్యాచ్ లో అతను బౌలింగ్ చేయాల్సింది". అంటూ విరాట్ కోహ్లిని ఉద్దేశించి ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
ద్రావిడ్ ఈ కామెంట్స్ విరాట్ కోహ్లీ గురించి చెప్పాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా రోహిత్ శర్మ ఇటీవలే విరాట్ కోహ్లీని మాకు ఆరో బౌలర్ గా ఉపయోగించుకుంటాము అని తెలిపాడు. విరాట్ కూడా గతంలో బౌలింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ వరల్డ్ కప్ లో బంగ్లాపై హార్దిక్ గాయపడడంతో విరాట్ మిగిలిన మూడు బంతులు వేసాడు. మొత్తానికి ఆరో బౌలర్ గా విరాట్ ను వాడుకుంటే ఫ్యాన్స్ కు పండగే. కానీ ఎంతవరకు ప్రభావం చూపిస్తాడో చూడాలి.
#CWC23 pic.twitter.com/7tHkBbXDJq
— Himalayan Guy (@RealHimalayaGuy) November 4, 2023