భారత్, ఇంగ్లాండ్ మధ్య నేడు (మార్చి 7) జరుగుతున్న ఐదో టెస్టు టీమిండియా స్టార్ స్పిన్నర్ చంద్రన్ కు ఎంతో ప్రత్యేకంగా మారనుంది. ధర్మశాలలో జరుగుతున్న ఈ టెస్టు అశ్విన్ కెరీర్ లో 100వది కావడం విశేషం. టీమిండియా తరపున ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ ఆఫ్ స్పిన్నర్.. ఈ మ్యాచ్ కు ముందు గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నాడు. తన 100వ టెస్ట్ చూసేందుకు అశ్విన్ ఫ్యామిలీ వచ్చారు. అతని భార్య తో పాటు పిల్లలు వచ్చారు.
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ నుంచి క్యాప్ అందుకున్నాడు. ఫ్యామిలీ దగ్గర ఉండటంతో అశ్విన్ తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ అశ్విన్ కెరీర్ లో మర్చిపోలేనిది. రాజ్ కోట్ టెస్టులో 500 వికెట్ల ఘనత పూర్తి చేసుకొని చరిత్ర సృష్టించాడు. ఇక రాంచీ టెస్టులో 351 వికెట్లతో స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అశ్విన్ 4 టెస్టుల్లో17 వికెట్లు పడగొట్టాడు. హర్టీలి, బుమ్రా తర్వాత ఈ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ గా కొనసాగుతున్నాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. పటిదార్, ఆకాష్ దీప్ స్థానాల్లో దేవదత్ పడికల్, బుమ్రా ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్నారు.
Absolutely memorable!
— R.Sport (@republic_sports) March 7, 2024
R Ashwin receives a special cap to commemorate his 100th Test appearance for the Indian cricket team. Ash was all smiles as his wife Prithi and their children watched the event unfold.#RAshwin #INDvsENG #Dharamshala #TeamIndia #India pic.twitter.com/7LDtHrNGLp