Rahul Dravid: రూ. 5 కోట్లు వద్దు.. వాళ్లకు ఇచ్చినంతే ఇవ్వండి: బీసీసీఐని కోరిన ద్రవిడ్

Rahul Dravid: రూ. 5 కోట్లు వద్దు.. వాళ్లకు ఇచ్చినంతే ఇవ్వండి: బీసీసీఐని కోరిన ద్రవిడ్

టీ20 వరల్డ్ కప్ 2024 టీమిండియా ప్రధాన కోచ్.. మాజీ భారత కెప్టెన్.. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ మరోసారి తన గొప్ప మనసు   చాటుకున్నాడు. తన సింప్లిసిటీతో ఎన్నో సార్లు ఆశ్చర్యపరిచిన "ది వాల్".. తాజాగా టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ విషయంలో తన ఔనత్యాన్ని చాటుకున్నాడు. మిగిలిన కోచింగ్ సిబ్బందితో సమానంగా తనకు ప్రైజ్ మనీ ఇవ్వాలని బీసీసీఐని రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. బోనస్‌గా తన ప్రైజ్ మనీ రూ. 5 కోట్లను 2.5 కోట్లకు తగ్గించాలని బోర్డుకు సూచించాడట.

రోహిత్ కెప్టెన్సీలో భారత్ జట్టు టీ20 వరల్డ్ కప్ సాధించడంతో టీమిండియాకు బీసీసీఐ రూ. 125 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించారు. ఐసీసీ ప్రైజ్ మనీ రూ. 20 కోట్ల రూపాయలు కాగా.. బీసీసీఐ 6 రెట్లు ప్రైజ్ మనీని ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేసింది.  రివార్డ్‌లో భాగంగా స్క్వాడ్  ని 15మంది సభ్యులతో పాటు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఒకొక్కరు రూ.5 కోట్లు అందుకున్నారు. ద్రావిడ్ కోచింగ్ స్టాఫ్ లో భాగమైన బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌లకు ఒక్కొక్కరికి రూ.2.5 కోట్లు దక్కాయి.

2021 నవంబర్ లో భారత ప్రధాన కోచ్ గా ద్రవిడ్ అడుగుపెట్టాడు. తన రెండున్నరేళ్ల ప్రయాణంలో భారత్ 2022 సెమీస్ కు చేరింది. 2023 లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకొని తుది మెట్టుపై ఆస్ట్రేలియాపై బోల్తా పడింది. ఇక టీ20 వరల్డ్ కప్ 2024 తన కెరీర్ లో చివరిదని ప్రకటించిన తర్వాత భారత్ వరల్డ్ కప్ నెగ్గింది. దీంతో కోచ్ గా వరల్డ్ కప్ తో   ద్రవిడ్ కోచింగ్ పదవికి గుడ్ బై చెప్పి ఎమోషనల్ గా తన జర్నీని ముగించాడు.