Rajat Patidar: 2008 నుండి 2025 వరకు RCB కెప్టెన్లు వీరే

Rajat Patidar: 2008 నుండి 2025 వరకు RCB కెప్టెన్లు వీరే

ఐపీఎల్‌లో ఇంతవరకూ ఒక్కసారి ట్రోఫీ నెగ్గకపోయినా క్రేజ్‌ విషయంలో మాత్రం అగ్రశ్రేణి జట్లతో సమానంగా ఉన్న టీమ్.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(RCB). టైటిల్ గెలవకున్నా.. జట్టుకు మద్దతనిచ్ఛే విషయంతో ఆర్‌సీబీ అభిమానులు తరువాతే ఎవరైనా. టోర్నీ ప్రారంభానికి ముందు 'ఈ సాలా కప్ నామ్దే' అని నానా హడావుడి చేయడం.. చివరకు వచ్చాక నిరాశతో ఏడుపు లెక్కించటం వారికి సర్వసాధారణం. కానీ, ఈ ఏడాది అలా కాదట. ఖచ్చింతంగా కప్పు కొట్టి తీరతామంటున్నారు.

ఈ ఏడాది ఐపీఎల్ కోసం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగుళూరు యాజమాన్యం కొత్త కెప్టెన్‌ను నియ‌మించింది. 31 ఏళ్ల ర‌జ‌త్ ప‌టిదార్‌(Rajat Patidar)ను కొత్త సార‌ధిగా ప్రకటించింది. ఇతడిపై భారీ ఆశలే పెట్టుకున్నారు.. ఆ జట్టు అభిమానులు. టైటిల్ గెలిచి తమ కలను నెరవేరుస్తాడని అప్పుడే మొదలెట్టేశారు. సోషల్ మీడియాలో వీరి హడావుడి మామూలుగా లేదు.

Also Read :- పంత్ను కాపాడిన యువకుడు చావుబతుకుల్లో

ఇక 2008 నుంచి ఇప్పటివరకూ RCB కెప్టెన్లు ఎవరన్నది చూస్తే.. ప‌టిదార్‌‌కు ముందు ఏడుగురు జట్టును నడిపించారు. ఆర్‌సీబీ తొలి కెప్టెన్.. రాహుల్ ద్రావిడ్. 2008 ఐపీఎల్ తొలి సీజన్‌లో భారత మాజీ కెప్టెన్ ద్రవిడ్ జట్టును నడిపించారు. జాక్వెస్ కాలిస్, జహీర్ ఖాన్, డేల్ స్టెయిన్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, ఆర్‌సీబీ అప్పట్లో నిరాశపరిచింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలతో కింద నుండి రెండో స్థానంలో నిలిచింది.

తరువాతి సంవత్సరాలలో.. ఇంగ్లండ్ దిగ్గజం పీటర్సన్, భారత స్పిన్ మాంత్రికుడు కుంబ్లే, కివీస్ స్పిన్నర్ వెట్టోరి, ఆసీస్ వెటరన్ వాట్సన్, భారత రన్ మెషిన్ కోహ్లీ, సఫారీ సీనియర్ డుప్లెసిస్ ఆర్‌సీబీ జట్టును నడిపించారు.     

  • రాహుల్ ద్రావిడ్: 2008 (14 మ్యాచ్‌లు)
  • కెవిన్ పీటర్సన్: 2009 (6 మ్యాచ్‌లు)
  • అనిల్ కుంబ్లే: 2009- 2010 (35 మ్యాచ్‌లు)
  • డేనియల్ వెట్టోరి: 2011- 2012 (28 మ్యాచ్‌లు)
  • విరాట్ కోహ్లీ: 2011- 2023 (144 మ్యాచ్‌లు)
  • షేన్ వాట్సన్: 2017- 2017 (3 మ్యాచ్‌లు)
  • ఫాఫ్ డు ప్లెసిస్: 2022- 2024 (42 మ్యాచ్‌లు)
  • రజత్ పాటిదార్:  2025-...