Rahul Dravid: ద్రవిడ్ కారును ఢీ కొట్టిన ఆటో.. తృటిలో తప్పిన ప్రమాదం

Rahul Dravid: ద్రవిడ్ కారును ఢీ కొట్టిన ఆటో.. తృటిలో తప్పిన ప్రమాదం

భారత మాజీ కెప్టెన్, మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ కారుకు యాక్సిడెంట్ అయింది. రోడ్డుపై వెళ్తుండగా కారు ప్రమాదానికి గురయ్యింది. ద్రవిడ్ కారును ఓ ఆటో డ్రైవర్ ఢీకొట్టాడు. బెంగళూరులో మంగళవారం (ఫిబ్రవరి 4) సాయంత్రం 6 గంటల సమయంలో నగరంలో తిరుగుతుండగా అకస్మాత్తుగా వెనుకాల నుంచి వచ్చిన ట్రాలీ ఆటో కారును ఢీకొట్టింది. కారును ఢీకొట్టిన ఆటో డ్రైవర్‌తో ద్రవిడ్‌ గొడవకు దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదృష్టవశాత్తు చిన్న ప్రమాదమే జరగడంతో ద్రవిడ్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. 

ప్రమాదం జరిగిన సమయంలో కారును ద్రవిడ్ డ్రైవ్ చేస్తున్నట్టు వీడియోలో అర్ధమవుతుంది. ఇద్దరిలో ఎవరు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. వీడియోలో ద్రవిడ్‌కు ఆటో డ్రైవర్ ఏదో వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆటో డ్రైవర్‌, ద్రవిడ్‌ ఇద్దరూ కన్నడలో మాట్లాడుతున్నారు. తన కారు స్వల్పంగా దెబ్బతినడంతో ఆ విషయమై డ్రైవర్‌పై ద్రవిడ్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అర్ధమవుతుంది. 

Also Read :- టీ20ల్లో టాప్ వికెట్ టేకర్‌గా ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్

ఈ ఘటనపై ఇద్దరిలో ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ సంఘటన బెంగళూరులోని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్కిల్‌- హైగ్రౌండ్స్‌ మార్గంలో జరిగినట్టు తెలుస్తుంది. పోలీసులు ఈ సంఘటనపై ఇప్పటివరకు స్పందించలేదు. వారిద్దరూ మాట్లాడుకుని సర్దుబాటు చేసుకుని ఉంటారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఆటో డ్రైవర్‌తో ద్రవిడ్‌ గొడవ పడుతున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.