Rahul Dravid: ద్రవిడ్‌కు గాయం.. ఊత కర్రల సాయంతో నడుస్తున్న టీమిండియా దిగ్గజం

Rahul Dravid: ద్రవిడ్‌కు గాయం.. ఊత కర్రల సాయంతో నడుస్తున్న టీమిండియా దిగ్గజం

రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్ రాహుల్  ద్రవిడ్‌ కు గాయమైంది. బెంగళూరులో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఈ టీమిండియా దిగ్గజానికి గాయమైంది. దీంతో 2025 ఐపీఎల్ కు ముందు ప్రీ-సీజన్ శిక్షణ శిబిరానికి గాయం కారణంగా హాజరు కాలేదు. ద్రవిడ్‌ వేగంగా కోలుకుంటున్నాడని.. త్వరలోనే జట్టులో చేరుతారని ఫ్రాంచైజీ ధృవీకరించింది. సోషల్ మీడియాలో రాజస్థాన్ రాయల్స్ పోస్ట్ చేసిన ఫోటోలో ద్రవిడ్‌ ఎడమ కాలికి గాయమైనట్టు అర్ధమవుతుంది. మరో 9 రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2025 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ కొత్త ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ నియమితులయ్యారు.

గత సంవత్సరం 2024లో టీమిండియాకు టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ అందించిన తర్వాత ద్రవిడ్ భారత ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ఇప్పుడు అతను రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లతో కలిసి చేయనున్నారు. బుధవారం (మార్చి 12) రాత్రి అతను మైదానంలోకి వచ్చినప్పుడు, అతని పరిస్థితిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ద్రవిడ్‌ గోల్ఫ్ కార్ట్ ద్వారా మైదానంలోకి వచ్చి క్రచెస్ సహాయంతో నిలబడిన ఫోటో అభిమానులని కలవరపరిచింది. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ : MS Dhoni: ఇది ఊహించనిది.. ఒకే చోట కలిసిన ధోనీ, గంభీర్

ఐపీఎల్‌లో ఫేవరేట్స్ లో రాజస్థాన్ రాయల్స్ కూడా ఒకటి. ప్రస్తుతం ఆ జట్టు ప్రాక్టీస్ లో బిజీగా కనిపిస్తుంది. 2008 ఐపీఎల్ సీజన్ లో టైటిల్ గెలుచుకున్న ఆ జట్టు మరోసారి కప్ కొట్టే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త సీజన్‌కు ముందు జైపూర్‌లో ఏర్పాటు చేసిన ట్రెయినింగ్ క్యాంప్‌లో ఆ జట్టు ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు. గంటల కొద్దీ శ్రమిస్తూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, వ్యూహ రచన.. ఇలా అన్నింటా మెరుగవడంపై ఫోకస్ చేస్తున్నారు. సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.