IND vs AUS Final: ద్రావిడ్ పదవీకాలం ముగిసింది.. టీమిండియా నెక్స్ట్ హెడ్ కోచ్ ఎవరు..?

IND vs AUS Final: ద్రావిడ్ పదవీకాలం ముగిసింది.. టీమిండియా నెక్స్ట్ హెడ్ కోచ్ ఎవరు..?

వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది. సొంతగడ్డపై ట్రోఫీని ముద్దాడాలని కల తీరలేదు. 12 ఏళ్ళ తర్వాత సొంతగడ్డపై మరోసారి విశ్వవిజేతగా అవతరిస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఇదే సమయంలో ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం కూడా అధికారికంగా ముగిసింది. బీసీసీఐ కాంట్రాక్ట్‌ ప్రకారం వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌తో రాహుల్ ద్రవిడ్‌ పదవీకాలం పూర్తవుతుంది. దీంతో ఇప్పుడు టీమిండియా కొత్త కోచ్ ఎవరు అనే చర్చ మొదలైంది. ద్రావిడ్ ను కోచ్ గా కొనసాగిస్తారా లేకపోతే కోచ్ బాధ్యతలను వేరొకరికి అప్పగిస్తారా.. అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  

ఆస్ట్రేలియాపై వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత మాట్లాడిన ద్రావిడ్ తన పదవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. టీమిండియాతో నా ప్రయాణం అద్భుతంగా సాగింది. నా రెండేళ్ల పనితీరుపై సంతృప్తిగా ఉన్నాను.  బయట నుంచి ఎవరేమన్నా పట్టించుకోను. నా బాధ్యతలను ఎలా నిర్వర్తించానని స్వయంగా విశ్లేషించుకుంటా. అన్ని ఫార్మాట్లలో ఆటగాళ్లతో కలిసిపోయి పని చేయడం ఆనందంగా ఉంది. ఈ బాధ్యతను ఎంతో గౌరవంగా భావిస్తున్నా’’ అని ద్రవిడ్ తెలిపాడు.

ద్రావిడ్ తర్వాత టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ లక్ష్మణ్ ను నియమించే అవకాశలు ఉన్నాయి. నవంబర్ 23 నుంచి ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో   లక్ష్మణ్ ను హెడ్ కోచ్ గా నియమించే అవకాశలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లక్ష్మణ్ కోచ్ గా భారత యువ ఆటగాళ్ల జట్టు ఆసియా గేమ్స్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఇక ద్రావిడ్ విషయానికి వస్తే తన రెండేళ్ల కాలంలో ఐసీసీ టోర్నీలకు సంబంధించి రెండుసార్లు ఫైనల్స్‌కు, ఒకసారి సెమీస్‌కు జట్టును తీసుకెళ్లాడు. ఆసియా కప్‌లో విజేతగా నిలిపాడు.