
టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీ కలం ముగిసింది. తన చివరి టోర్నమెంట్ గెలిచి విజయవంతంగా కోచ్ స్థానం నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో బీసీసీఐ భారత్ హెడ్ కోచ్ గా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ను ఎంపిక చేసింది. శనివారం (జూలై 27) శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్ గంభీర్ కు భారత హెడ్ కోచ్ గా మొదటిది. ఈ సిరీస్ కు ముందు టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ గంభీర్ కు ఒక మెసేజ్ పంపించాడు.
"కోచ్ పదవిని చేపట్టిన గంభీర్‌కు విషెస్ చెబుతూ తన అనుభవాలను పంచుకున్నాడు. "భారత క్రికెట్ జట్టు కోచ్‌గా నీకు స్వాగతం. ప్రపంచ క్రికెట్ లో అత్యంత గొప్ప పోస్ట్ ఇది. ఆటగాడిగా గంభీర్‌తో కలిసి ఆడాను. అతని అంకిత భావం దగ్గరుండి చూసాను. టీమిండియాకు గొప్పగా పని చేస్తావని ఆశిస్తున్నాను. కష్టకాలంలో టీమిండియా ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్ నీ వెంట ఉంటుంది.
భారత జట్టుతో నా ప్రయాణం ముగిసి మూడు వారాలు అవుతోంది. విజయవంతంగా నా ప్రయాణాన్ని ముగించాను. ట్రోఫీ కంటే ఎక్కువగా జట్టుతో నా స్నేహాలను, జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకుంటాను. ఐపీఎల్‌లో ఒక మెంటర్‌గా గెలవాలనే నీ కసిని చూశాను. అలాగే యువ క్రికెటర్లను నువ్వు ట్రైన్ చేసే విధానం, వాళ్లను బెస్ట్ క్రికెటర్లుగా నువ్వు మార్చే తీరు చూశాను".అని ద్రవిడ్ అన్నాడు.
ద్రవిడ్ మెసేజ్‌పై గంభీర్ ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది. ద్రవిడ్ మెసేజ్ తనకెంతో విలువైనదని.. అతని మెసేజ్ పై ఎలా స్పందించాలో అర్ధం కావట్లేదని గంభీర్ అన్నాడు. నేను చూసిన ఒక సెల్ఫ్‌లెస్ క్రికెటర్ నుంచి వచ్చినందుకు ఆనందంగా ఉందని అతని మెసేజ్ నన్ను ఎమోషనల్ కు గురి చేసిందని గంభీర్ చెప్పుకొచ్చాడు.
2021 నవంబర్ లో భారత ప్రధాన కోచ్ గా ద్రవిడ్ అడుగుపెట్టాడు. తన రెండున్నరేళ్ల ప్రయాణంలో భారత్ 2022 సెమీస్ కు చేరింది. 2023 లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకొని తుది మెట్టుపై ఆస్ట్రేలియాపై బోల్తా పడింది. ఇక టీ20 వరల్డ్ కప్ 2024 తన కెరీర్ లో చివరిదని ప్రకటించిన తర్వాత భారత్ వరల్డ్ కప్ నెగ్గింది.
??????? ?? ??? ????? ???? ????? & ?????! ?
— BCCI (@BCCI) July 27, 2024
To,
Gautam Gambhir ✉
From,
Rahul Dravid ?#TeamIndia | #SLvIND | @GautamGambhir pic.twitter.com/k33X5GKHm0