బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో కొట్లాడుతం: రాహుల్ గాంధీ

బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో కొట్లాడుతం: రాహుల్ గాంధీ
  • కేంద్రం వైఖరిని  ప్రజలకు వివరించండి
  • రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ
  • ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయండి
  • కాంగ్రెస్ వెన్నంటే తెలంగాణ ప్రజలు  
  • కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ

ఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో కొట్లాడుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇవాళ  పార్లమెంట్ లో అగ్రనేతలు సోనియా,రాహుల్ ను రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల బృందం కలిసింది. నిన్న జంతర్ మంతర్ లో బీసీ రిజర్వేషన్ల ధర్నా వివరాలను వివరించిన పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్,  మంత్రులు, విప్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ అగ్రనేతలకు వివరించారు. 

ఈ  సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో అనుసరిస్తున్న వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వెన్నంటే ఉన్నారని అన్నారు. మేలు చేస్తే మరచిపోరని చెప్పారు. రిజర్వేషన్లు బడుగు బలహీన వర్గాల్లో జీవితాల్లో మార్పలు తెస్తాయని అన్నారు. మరింత కష్టపడి అందరికీ సంక్షేమ ఫలాలను పంచాలని సూచించారు. ఈ సందర్భంగా తనను కలిసి రాష్ట్ర నాయకులను  సోనియా గాంధీ ఆప్యాయంగా పలకరించారు.