అదానీని అరెస్ట్ చెయ్యరు..నేను గ్యారంటీ ఇస్తా: రాహుల్ గాంధీ

గౌతమ్ ఆదానీపై వస్తున్న లంచం ఆరోపణలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. అదానీ అమెరికా, భారత్ చట్టాలను ఉల్లంఘించారని అభియోగాలు వస్తున్నాయి.. అదానీ వెనుక మోదీ ఉన్నారు.. అదానీని ఎవరూ అరెస్ట్ చెయ్యరు అని రాహుల్ అన్నారు. 

అదానీ ఇష్యూపై  జేపీసీ వేయడంతో పాటు అదానీని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు రాహుల్. అలాగే ఈ కేసులో అదానీని కాపాడుతున్న సెబీ చీఫ్ మాధవిని విచారించాలని రాహుల్ డిమాండ్ చేశారు. అదానీ విషయాన్ని పార్లమెంట్ లో లేవెనెత్తుతామన్నారు. 2 వేల కోట్ల స్కామ్ కు పాల్పడినా..  అదానీని ఎవరూ అరెస్ట్ చేయలేరు..నేను గ్యారంటీ ఇస్తున్నా..ఎందుకంటే అతడిని భారత ప్రభుత్వం కాపాడుతోంది అని రాహుల్ అన్నారు.

అదానీ 20 ఏళ్లలో.. 2 బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు2 వేల కోట్లు  లంచాలు చెల్లించేందుకు అంగీకరించారని అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి .ఈ కేసులో యూఎస్ లంచం నిరోధక చట్టం ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ను ఉల్లంఘించినట్లు వెల్లడించారు. 

కేసులో ఎవరెవరు ఉన్నారు..?

అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు, కంపెనీ ఎగ్జిక్యూటివ్ సాగర్ R. అదానీ, ఇండియన్ ఎనర్జీ కంపెనీ మాజీ CEO S. జైన్, US ఇష్యూయర్ మాజీ CEO రంజిత్ గుప్తా మొత్తం నలుగురు ఈ ఫ్రాడ్ లో ఉన్నట్లు సమాచారం. వీరితోపాటు మోసం గురించి తెలిసి ఇతరులకు చెప్పని నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను కూడా కేసులో భాగమై ఉన్నారు.