హత్రాస్ రేప్ ఘటన: వాళ్లను ఓ క్రిమినల్లా చూస్తున్నారు.. షేమ్ఫుల్..రాహుల్ ఎమోషనల్ ట్వీట్

హత్రాస్ రేప్ ఘటన: వాళ్లను ఓ క్రిమినల్లా చూస్తున్నారు.. షేమ్ఫుల్..రాహుల్ ఎమోషనల్ ట్వీట్

ఐదేళ్లుగా మానని గాయం..బిక్కుబిక్కు మంటూ భయంతో బతుకు.. ఏదో పెద్ద నేరం చేసినట్లు గ్రామస్తుల చిన్నచూపు.. క్రిమినల్స్ గా  ట్రీట్.. ఓపక్క కూతురు పోయిన బాధ.. మరోపక్క ఏ క్షణాన ఏ ఆపద వచ్చిపడుతుందోనన్న భయం..నిత్యం చచ్చి బతుకీడుస్తున్న క్షణం.. ఇది ఐదేళ్ల క్రితం అత్యంత దారుణంగా రేప్ చేసి చంపబడ్డ బాలిక కుటుంబం పరిస్థితి..ఏ ప్రభుత్వం ఆదుకోలేదు..ఏ దేవుడు అండగా నిలవలేదు.. ఎందుకీ దుస్థితి .. వాళ్లు చేసిన నేరం ఏంటీ.. ?

ఐదేళ్ల క్రితం రేప్ చేయబడి అత్యంత దారుణంగా చంపబడిన హత్రాస్ బాలిక కుటుంబాన్ని లోక్ సభ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ కలిశారు. గురువారం (డిసెంబర్ 12) హత్రాస్ రేప్ బాధితు రాలి ఇంటికి వెళ్లిన రాహుల్ గాంధీ..వారి స్థితిని చలించిపోయారు. దాదాపు 35 నిమిషాలు హత్రాస్ బాధితురాలి కుటుంబంతో మాట్లాడిన రాహుల్.. తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు.. మీడియాతో మాట్లాడకుండానే అక్కడినుంచి వెళ్లిపోయారు.

హత్రాస్ బాధితురాలి కుటుంబం దీనస్థితి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..నేను ఈరోజు హత్రాస్ బాధితురాలి కుటుంబాన్ని కలిశారు.  నాలుగేళ్ల క్రితం జరిగిన అత్యంత అవమాన కర, దురదృష్ట సంఘటన ఎదుర్కొన్న కుటుంబాన్ని కలిశారు. వాళ్లు చెప్పిన విషయాలు విని షాక్ తిన్నాను అని రాహుల్ పోస్ట్ లో రాశారు. 

హత్రాస్ బాధితురాలి కుటుంబం అంతా భయంతో బతుకీడుస్తున్నారు. వారిని ఓ క్రిమినల్స్ లా చూస్తున్నారు.వారు తుపాకులు, నిఘాల కెమెరాల మధ్య నిత్యం చస్తూ బతుకీడుస్తున్నారని .. రాహుల్ తన ఆవేదననను వ్యక్తం చేశారు. 

హత్రాస్ బాధితురాలి కుటుంబానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ఒక్కహామిని కూడా నెరవేర్చలేదు.. పైగా వారి రక్షణ బాధ్యతను విస్మరించింది. నిందితులు స్వేచ్ఛగా తిరుగుతుంటే.. ప్రభుత్వం బాధితులను రకరకాలుగా హింసిస్తోందని’’  లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

ఆ కుటుంబ సభ్యుల నిరాశ నిస్పృహలను చూస్తుంటే.. దళితులపై బీజేపీ అఘాయిత్యాల నిజాన్ని చూపిస్తుందన్నారు. హత్రాస్ బాధితురాలి కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది.. మా శాయశక్తులా బాధితురాలి రక్షించేందుకు పోరాడుతామరు రాహుల్ గాంధీ.