కేంద్రంపై తీవ్ర విమర్శలుచేశారు రాహుల్ గాంధీ. మహారాష్ట్రలో ఎన్నికల సమయంలో ఆకస్మాత్తుగా 70 లక్షల ఓట్లు పెరిగాయని చెప్పారు. మహారాష్ట్రలోని ఓ బిల్డింగ్ లో 7 వేల ఓట్లు నమోదయ్యాయని చెప్పారు. బీజేపీ ఎక్కడైతే ఓడిపోతుందనుకుంటుందో అక్కడే ఓట్లు పెరుగుతాయని రాహుల్ విమర్శించారు. ఎలక్షన్ కమిషన్ కు ఎన్ని సూచనలు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.
ALSO READ | తెలంగాణలో 90 శాతం వెనుకబడిన వాళ్లే: రాహుల్ గాంధీ
మహారాష్ట్రలో ఎలక్షన్లకు ముందు ఎన్నికల అధికారులను మార్చారని ఆరోపించారు రాహుల్. ఐదు నెలల్లో మహారాష్ట్రలో 70 లక్షల ఓట్లు పెరిగాయని ఆరోపించారు రాహుల్. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఓటర్ల లిస్ట్ లో అవకతవకలు జరుగుతున్నాయని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ పై తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు రాహుల్ గాంధీ.