ఎన్నికల ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్ సిద్దమౌవుతుంది. తెలంగాణలో 3 రోజుల పాటు కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర చేయనున్నారు. 3 రోజుల్లో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ బస్సు యాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటారు. ఈ బస్సు యాత్రలో వివిధ వర్గాలతో వారు ముచ్చటించనున్నారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులతో ముచ్చటిస్తారు.
ఇప్పటికే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల తెలంగాణ పర్యటన ఖారరైంది. 2023 ఆక్టోబర్ 18న వరంగల్ లోని రామప్పగుడిని వారు దర్శించుకోనున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల కార్డుకు రామప్ప ఆలయంలో పూజలు చేయించనున్నారు. సాయంత్రం 5 గంటలకు బస్సు యాత్రను రాహుల్, ప్రియాంక ప్రారంభించనున్నారు. అనంతరం రామానుజపురంలో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గోని ప్రసంగిస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పరిశీలించారు.