న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ రైతులపై హామీల వర్షం కురిపిస్తోంది. కిసాన్ న్యాయ్ హామీ కింద రైతులకు ఐదు గ్యారంటీలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం ( మార్చి 14) Xలో ప్రకటించారు. తమ డిమాండ్లను ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న రైతుల ఆందోళన క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఈ హామీలను ప్రకటించింది. స్వామినాథన్ కమిటీ సిపారసుల ప్రకారం MSP కి చట్టపరమైన హామీ, రైతుల రుణమాఫీకి శాశ్వత వ్యవసాయ రుణమాఫీ కమిషన్, రైతు బీమా పథకం, పంటఎగుమతి విధానం, వ్యవసాయ వస్తువులపై జీఎస్టీ తొలగించడం వంటి హామీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు.
రైతులకు కాంగ్రెస్ ఐదు గ్యారంటీలు
- స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం MSP కి చట్టపరమైన హోదా
- రైతుల రుణాలను మాఫీ చేసేందుకు రుణమాఫీ మొత్తాన్ని నిర్ణయించేందుకు శాశ్వత వ్యవసాయ రుణ మాఫీ కమిషన్ రూపకల్పన
- బీమా పథకాన్ని మార్చడం ద్వారా పంట నష్టం జరిగితే 30 రోజులలో పు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా హామి
- రైతుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని కొత్త దిగుమతి , ఎగుమతి విధానాన్ని రూపొందించడం
- వ్యవసాయ వస్తువుల నుంచి జీఎస్టీని తొలగించడం ద్వారా రైతులను జీఎస్టీ రహితంగా చేస్తామని హామి
‘‘దేశంలోని అన్నదాతలందరి సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ఐదు హామీలను మీ ముందుకు తీసుకొచ్చింది. తమ చెమటతో దేశ నేలకు నీరందించే రైతుల జీవితాలను సంతోషం, ఆనందంగా మార్చడమే కాంగ్రెస్ లక్ష్యమని ఈ ఐదు చారిత్రక నిర్ణయాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నామని ’’ రాహుల గాంధీ X లో తెలిపారు.
देश के सभी अन्नदाताओं को मेरा प्रणाम!
— Rahul Gandhi (@RahulGandhi) March 14, 2024
कांग्रेस आपके लिए 5 ऐसी गारंटियां लेकर आई है जो आपकी सभी समस्याओं को जड़ से खत्म कर देंगी।
1. MSP को स्वामीनाथन आयोग के फार्मूले के तहत कानूनी दर्ज़ा देने की गारंटी।
2. किसानों के ऋण माफ़ करने और ऋण माफ़ी की राशि निर्धारित करने के लिए एक… pic.twitter.com/sfIUcdeW6t