ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త వరద సహాయక చర్యల్లో పాల్గొనాలి : రాహుల్ గాంధీ

ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త వరద సహాయక చర్యల్లో  పాల్గొనాలి : రాహుల్ గాంధీ

ఏపీ, తెలంగాణలో  వరదలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాడ సానుభూతి తెలిపారు.   రెండు రాష్ట్రాల్లో  వరద సహాయక చర్యల్లో ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త పాల్గొనాలని పిలుపునిచ్చారు.  వరద సహాయక చర్యల్లో తెలంగాణ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని చెప్పారు రాహుల్ గాంధీ.  ఈ విపత్తులో నష్టపోయిన వారందరికీ త్వరితగతిన అన్ని రకాలుగా ఆదుకోవాలని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.  

ALSO READ | కరకట్టపై మునిగిన మంతెన ఆశ్రమం.. తాళ్ల సాయంతో బయటకొస్తున్న బాధితులు

మరోవైపు వరదలపై రివ్యూ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. వరదల్లో చిక్కుకుని చనిపోయిన మృతుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్ గ్రేషియాను పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అందిస్తోన్న రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియాను రూ.5 ఐదు లక్షలకు పెంచారు. రోడ్డు మార్గాన  ఖమ్మం బయలుదేరిన రేవంత్.. ఖమ్మంలో మున్నేరు వాగు బీభత్సానికి గురైన వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడనున్నారు.