మోదీ, అదానీ మాస్క్లతో కాంగ్రెస్ ఎంపీలు..  రాహుల్  పరిహాసం

మోదీ, అదానీ మాస్క్లతో కాంగ్రెస్ ఎంపీలు..  రాహుల్  పరిహాసం

న్యూఢిల్లీ:  పార్లమెంటు ఆవరణలో  ఇవాళ(సోమవారం) ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అదానీ అవినీతిపై విపక్షాల నిరసనలో భాగంగా ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు మోదీ, అదానీ మాస్క్లతో దర్శనమిచ్చారు. వారిని విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పరిహాసం చేయడం అందరినీ ఆకర్షించింది. కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాగూర్, సప్తగిరి శంకర్ ఇవాళ మోదీ, అదానీ మాస్క్లు ధరించి నిరసనల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వారిని స్వయంగా ఫోటోలు తీశారు. తమ మధ్య బంధమేంటో చెప్పాలని  (మోదీ, అదానీలను ఉద్దేశించి) వారితో పరిహాసమాడారు.  ఇక అదానీపై యూఎస్లో నమోదైన అవినీతి ఆరోపణలపై ఎప్పటిలాగే నిరసనలు కొనసాగాయి. 

Also Read:-ఢిల్లీలో 40 స్కూళ్లకు బాంబు బెదిరింపు

ఇవాళ పార్లమెంటు మొదలైన కొంత సేపటికే విపక్ష సభ్యుల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత 11 గంటలకు ప్రారంభమైన సభలు గందరగోళం మధ్య మళ్లీ వాయిదా పడ్డాయి. విపక్షాలు ఆందోళనలు విరమించకపోవడంతో స్పీకర్ ఓం బిర్లా లోక్సభను మధ్యాహ్నం 12 గం.లకు వాయిదా వేశారు.

ఇక రాజ్యసభలో ఆందోళనలు చేస్తున్న సభ్యులను ఛైర్మన్ జగదీప్ ధన్కర్ నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా లాభం లేకపోవడంతో సభను మరోసారి వాయిదా వేస్తున్నట్లు. అనంతరం సభ ప్రారంభమయ్యాక ఛైర్మన్ ధన్కర్పై విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఆడుతున్న క్రీడలో భాగస్వామ్యం అయ్యారని పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సభను మరోసారి వాయిదా వేశారు.