మోదీ ప్రాణం అదానీ చేతిలో.. అందుకే ఫోన్లు ట్యాపింగ్: రాహుల్

మోదీ ప్రాణం అదానీ చేతిలో.. అందుకే ఫోన్లు ట్యాపింగ్: రాహుల్

ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మోదీ ప్రాణం అదానీ చేతిలో ఉందని వ్యాఖ్యానించారు.   కేంద్రం తమ పార్టీ నేతల ఫోన్లపై నిఘా పెట్టిందని ఆరోపించారు .  కేసీ వేణుగోపాల్, పవన్ ఖేడాలకు యాపిల్ కంపెనీ నుంచి మేసేజ్ లు వచ్చాయని చెప్పారు. మోదీ అదానీ  కోసమే పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు.  ఇంత కాలం మోడీ నంబర్ వన్, అదానీ నంబర్ 2 అనుకున్నాం కానీ..  నంబర్ 1 అదానీ అని ఇపుడే అర్థమైందన్నారు. 

ఫోన్లు ఎంత ట్యాపింగ్ చేసినా భయపడేది లేదన్నారు రాహుల్. అవసరమైతే తన ఫోన్ ఇస్తానని చెప్పారు.  ఫోన్ల హ్యాకింగ్ పై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదాని దేశ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని ఆరోపించారు. విద్యుత్, రైలు, ఫ్లైట్ ఇలా అన్నింట్లో అదాని ట్యాక్స్ లు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. సమస్యలపై యువత దృష్టి మళ్లించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు రాహుల్ గాంధీ.  యువతకు న్యాయం జరగనంత వరకు దేశం అభివృద్ది చెందదన్నారు. కులగణనతోనే యువతకి న్యాయం జరుగుతుందన్నారు.