కొనసాగుతున్న రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టి ‘భారత్ జోడో యాత్ర’ 51వ రోజుకు చేరుకుంది. తెలంగాణలో మూడో రోజు పాదయాత్ర మరికల్ మండలం యలిగండ్ల నుంచి యాత్ర మొదలుపెట్టారు. మరికల్, దేవరకద్ర మీదుగా మన్యంకొండ వరకు భారత్ జోడోయాత్ర కొనసాగనుంది. మొత్తం 23.3 కిలో మీటర్ల పాదయాత్ర కొనసాగనుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రాత్రికి మహబూబ్ నగర్ లో యాత్ర నిలిచిపోతుందని నేతలు తెలిపారు. ఉదయం 6.10 గంటలకు రాహుల్ పాదయాత్ర మొదలు పెట్టారు.

కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్, ఏఐసీసీ నేత కేసీ వేణు గోపాల్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర, గోప్లపూర్ కలాన్ లో విరామం తీసుకున్న అనంతరం మళ్లీ సాయంత్రం పాదయాత్ర కొనసాగిస్తారు. మన్యంకొండ దేవాలయం ప్రాంతంలో జరిగే సమావేశంలో రాహుల్ పాల్గొననున్నారు. గురువారం 26.7 కిలోమీటర్ల మేర రాహుల్ నడిచారు. మక్తల్ లో శ్రీ బాలాజీ ఫ్యాక్టరీ వద్ద పాదయాత్రను ముగించారు.