రాహుల్ ఓసీడీతో బాధపడుతున్నడు..కాంగ్రెస్ నేతకు బీజేపీ కౌంటర్

రాహుల్ ఓసీడీతో బాధపడుతున్నడు..కాంగ్రెస్ నేతకు బీజేపీ కౌంటర్

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అమెరికా పర్యటనపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్లకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఆయన అబ్సెసివ్–కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ)తో బాధపడు తున్నారని విమర్శించింది. ‘‘రాహుల్ ఎప్పుడూ అదానీ, హిండెన్ బర్గ్, రాఫెల్ గురించే ఆలోచిస్తున్నడు. అందుకే మానసికంగా ఇబ్బందులు పడుతున్నడు” అని బీజేపీ  అధికార ప్రతినిధి అజయ్ అలోక్ అన్నారు. 

‘‘26/11 ఉగ్రదాడి నిందితుడు రాణాను  అప్పగించేందుకు అమెరికా ఒప్పుకుంది. ఇది మోదీ   విజయం. మోదీ ప్రధాని హోదాలో అమెరికా టూర్  వెళ్లారు.. బీజేపీ లీడర్ హోదాలో కాదు. ఇది రాహుల్ గుర్తుంచుకోవాలి. ప్రధాని   మోదీ విదేశీ పర్యటనల్లో లోపాలను వెతకడం కాంగ్రెస్ కు అలవాటుగా మారింది” అని బీజేపీ సీనియర్ లీడర్ షానవాజ్ హుస్సేన్ అన్నారు.