మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రయాగ్ రాజ్ తొక్కిసలాటలో అనేక మంది ప్రాణా లు కోల్పోవడం, వందల సంఖ్యలో భక్తులు గాయపడటం హృదయాన్ని కలచివేసిందన్నారు. ప్రభుత్వ తప్పిదం వల్లే ఈ విషాద ఘటనకు కారణమని అన్నా రు. సాధారణ భక్తుల భద్రతకు బదులుగా వీఐపీలపై దృష్టి పెట్టడం వల్లే ఈ ఘటన జరిగిందని రాహుల్ గాంధీ విమర్శించారు.
प्रयागराज महाकुंभ में भगदड़ के कारण कई लोगों के मौत और कईयों के घायल होने की ख़बर अत्यंत दुखद है।
— Rahul Gandhi (@RahulGandhi) January 29, 2025
शोकाकुल परिवारों के प्रति अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं और घायलों के शीघ्र स्वस्थ होने की आशा करता हूं।
इस दुखद घटना के लिए कुप्रबंधन, बदइंतजामी और आम श्रद्धालुओं की जगह VIP…
ప్రయాగ్ రాజ్ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు రాహుల్ గాంధీ. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కష్టకాలంలో కార్యకర్తలు, నాయకులు ముందుకు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ALSO READ | కుంభమేళాలో తొక్కిసలాట బీభత్సం : పదుల సంఖ్యలో భక్తులు మృతి
మౌని అమావాస్య రోజున పవిత్ర స్నానాలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే మహాకుంభ మేళాలో ఏర్పాట్లపై ఈ విషాద ఘటన ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక ముందురోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా మరిన్ని ప్రమాదాలు జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టడంపై అధికారులపై మరింత భారం పడుతుందన్నారు రాహుల్ గాంధీ.