హోటల్​లో అనుకోకుండా కలిసిన రాహుల్ గాంధీ , తేజస్వీ

పట్నా: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పట్నాలో అనుకోకుం డా కలుసుకున్నారు. ఓ హోటల్​లో వీరిద్దరూ ఎదురుపడ్డారు. పట్నాలోని హోటల్​లో ఆర్జేడీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్​ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హోటల్ హాలులో ఆర్జేడీ ప్రెసిడెంట్ లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులు కూర్చున్నారు.

అదే సమయంలో ‘సంవిధాన్ సురక్షా సమ్మేళన్’ ప్రాంగణానికి వెళ్లేముందు ఫ్రెషప్ కావడానికి రాహుల్ గాంధీ ఇదే హోటల్​కు వచ్చారు. రాహుల్ గాంధీని చూసిన తేజస్వీ యాదవ్ ఎదురు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలకరించారు.