రాహుల్ నన్ను టెర్రరిస్టు అంటున్నడు

మొహాలీ: కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్​ రాహుల్ గాంధీపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్​ అరవింద్ కేజ్రీవాల్ సీరియస్ అయ్యారు. రాహుల్ తనను టెర్రరిస్ట్ అంటున్నారని కేజ్రీవాల్ అన్నారు. తాను ఏంటనేది ఈనెల 20న రాహుల్ కు తెలుస్తుందని చెప్పారు. పంజాబ్ లోని వ్యాపారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. మరో ఇరవై రోజులు ఆగితే తమ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని.. అప్పుడు ఎవరికీ భయపడకుండా బిజినెస్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. పంజాబ్ లో ఆప్ సర్కారు ఏర్పాటు చేసేందుకు అన్ని వర్గాల ప్రజలతో పాటు వ్యాపారులు కూడా తమకు ఓ అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు. ఒక్క ఛాన్స్ ఇస్తే సుపరిపాలనను అందిస్తామని.. ఐదేళ్లలో ప్రజల మనసులు గెలుచుకుంటామని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే అమృత్ సర్ ను వరల్డ్ ఐకాన్ సిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు. 

కాగా, పంజాబ్ ఎన్నికల వేళ ఆప్ చీఫ్​ కేజ్రీవాల్ ను టార్గెట్ గా చేసుకుని రాహుల్ గాంధీ పలు కామెంట్స్ చేశారు. టెర్రరిస్టు ఇంట్లో కాంగ్రెస్ నేతలు కనిపించరని.. కానీ అక్కడ ఆప్ పెద్ద నేత కనిపిస్తారంటూ కేజ్రీవాల్ ను ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యలు చేశారు. వీటికి స్పందనగా కేజ్రీవాల్.. తాను ఏంటనేది ఈనెల 20న తెలుస్తుందని కౌంటర్ ఇచ్చారు. ఈనెల ఇరవై తేదీన పంజాబ్ లోని 117 అసెంబ్లీ నియోజవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. 

మరిన్ని వార్తల కోసం:

అజిత్ దోవల్ ఇంట్లోకి చొరబాటు యత్నం

ఖాళీలు ఉన్నా కావాలనే భర్తీ చేయట్లే

ఆయన పాటల వల్లే నా సినిమాలకు ప్రజాదరణ