మే 5న తెలంగాణకు రాహుల్ గాంధీ

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. 5 వ తేదీన ఆయన పర్యటనకు ఏర్పాట్లు చేయాలని ఏఐసీసీ నేతలు పీసీసీ నాయకత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెల్సింది. భువనగిరి, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో  రాహుల్ సభలను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే, ఇందులో భువనగిరి, ఆదిలాబాద్ లలో జరిగే రెండు సభలు మొదటి విడతలో ఖరారు కావచ్చని పార్టీ నేతలంటున్నారు.