హత్రాస్ ఘటన చాలా బాధాకరం: రాహుల్ గాంధీ

హత్రాస్ ఘటన చాలా బాధాకరం: రాహుల్ గాంధీ

లక్నో: ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 80కి పైగా భక్తులు మరణించారు. వందలాది మంది గాయాపాలయ్యారు. హత్రాస్ ఘటనపై కాంగ్రెస్ నేత, లోక్ సభ ప్రతి పక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. హత్రాస్ ఘటన చాలా బాధాకరం అన్నారు రాహుల్ గాంధీ.   మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి  తెలిపారు. గాయపడినవారు త్వరలో కోలుకో వాలని కోరుకున్నారు. యూపీ ప్రభుత్వం సహాయ చర్యలు వేగవంతం చేయాలని అన్నారు. బాధితులకు ప్రతి ఒక్కరికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. గాయపడిన , బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ కార్యకర్తలు  సహాయాన్ని అందించాలన్నారు. 

జూలై 2 మధ్యాహ్నం హత్రాస్ జిల్లాలోని  రతీభాన్ పూర్  గ్రామంలో మతపరమైన కార్యక్రమం ముగిసిన తర్వాత జరిగి ఈ తొక్కిసలాటలో 80కి పైగా భక్తులు చనిపోయారు. వందలాది మంది గాయ పడ్డారు. గాయపడిన వారిని ఇటాహ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న యూపి సీఎం యోగి సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. హత్రాస్ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు యూపి ప్రభుత్వం రూ. 2 లక్షల చొప్పున , గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్  గ్రేషియా ప్రకటించింది. 

లోక్ సభ జరుగుతుండగానే ఈ ఘటన విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు..ఘటన పై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  హత్రాస్ ఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని యూపీ అధికారులు చెబుతున్నారు.