తెలంగాణలో ప్రజల సర్కార్ పాలన ప్రారంభమైంది: రాహుల్ గాంధీ

తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. డిసెంబర్ 7వ తేదీ గురువారం ఎల్బీ స్టేడియంలో జరిగిన సీఎం, మంత్రుల ప్రమాణస్వీకారానికి సోనియా, ప్రియాంకలతో పాటు రాహుల్ గాంధీ ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం ఢిల్లీ వెళ్లిన రాహుల్.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు ఎక్స్ లో అభినందనలు తెలిపుతూ.. "తెలంగాణలో ప్రజల సర్కార్ పాలన ప్రారంభమైంది. బంగారు తెలంగాణ స్వప్నాన్ని నిజం చేస్తాం. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను అమలు చేస్తాం" అని పోస్ట్ చేశారు.

ప్రమాణస్వీకారం అనంతరం ప్రభుత్వం మంత్రులకు శాఖలను ప్రకటించింది. ఎవరికి ఏ శాఖ ఇవ్వనున్నారో స్పష్టం చేసింది. 

* ఉత్తమ్ కుమార్ రెడ్డి : హోంశాఖ (హుజుర్ నగర్ ఎమ్మెల్యే)

* -కోమటిరెడ్డి వెంకటరెడ్డి :  మునిసిపల్ శాఖ (నల్గొండ ఎమ్మెల్యే )

*దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆర్థిక శాఖ (మంథని ఎమ్మెల్యే)

* పొంగులేటి శ్రీనివాస రెడ్డి : -నీటి పారుదల శాఖ (పాలేరు ఎమ్మెల్యే) 

* కొండా సురేఖ : -మహిళా సంక్షేమం శాఖ (వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే)

* మల్లు భట్టివిక్రమార్క : - డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ (మధిర ఎమ్మెల్యే)

* దామోదర రాజనర్సింహ : వైద్య ఆరోగ్యశాఖ (ఆందోల్ ఎమ్మెల్యే)

* జూపల్లి కృష్ణారావు : పౌర సరఫరాల శాఖ (కొల్లాపూర్ ఎమ్మెల్యే )

* సీతక్క, గిరిజన సంక్షేమ శాఖ ( ములుగు ఎమ్మెల్యే ) 

* తుమ్మల నాగేశ్వరరావు :  -రోడ్లు, భవనాల శాఖ (ఖమ్మం ఎమ్మెల్యే )