ప్రధాని మోడీ రాజ్యాంగం చదవలే: రాహుల్ గాంధీ

ప్రధాని మోడీ రాజ్యాంగం చదవలే: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ రాజ్యాంగం చదవలేదని కాంగ్రెస్ అగ్రనేత, లోక సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. రాజ్యాంగంతోనే సామాజిక సాధికారత లభిస్తోందని.. అందుకే దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాలని రాజ్యాంగం చెప్పలేదని బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. 

జాతీయ రాజ్యాంగ దినోత్సవం (నవంబర్ 26) సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తదితర కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణలో కుల గణన సర్వే ప్రారంభమైందని తెలిపారు.

Also Read :- ఢిల్లీలో ప్రియాంకగాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

కుల గణనతోనే ప్రజల సామాజిక పరిస్థితులు తెలుస్తాయని.. అందుకే దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ, కర్నాటకలో కుల గణన చేపట్టామని గుర్తు చేశారు. కుల గణన ద్వారా ఎవరికీ దక్కాల్సిన వాటా వారికి దక్కుతోందని రాహుల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ రాజ్యాంగాన్ని రక్షించాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.