రాహుల్ గాంధీ పరువు నష్టం కేసు.. విచారణ వాయిదా

మోడీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీపై సూరత్ కోర్టులో పరువు నష్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో తీర్పిచ్చిన కోర్టు రాహుల్ గాంధీపై రెండేళ్ల జైలు శిక్షను అమలు చేసింది. దాంతో రాహుల్ గాంధీ ఎంపీగా చెల్లుబాటు కారని లోక్ సభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు. 
 
అయితే, ఈ కేసు విచారణ శనివారం (ఏప్రిల్ 29) గుజరాత్ హైకోర్టులో జరుగనుండగా.. విచారణను మంగళవారానికి వాయిదా వేసినట్లు కోర్టు ప్రకటించింది. సూరత్ కోర్టు తీర్పుపై స్టే విధించాలని రాహుల్ తరుపు లాయర్ అభిషేక్ మను సంఘ్వీ వాదనలు వినిపించగా.. కౌంటర్ దాఖలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీని హైకోర్టు ఆదేశించింది. 

తర్వాత తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. పీఎం మోడీని దృష్టిలో పెట్టుకుని మోడీ ఇంటి పేరున్న వాళ్లంతా దొంగలు అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి  పూర్ణేష్.. కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.