ఆదిలాబాద్ లో రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఒక్క కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. ప్రజా తెలంగాణ రావాలనే తన ఆకాంక్షన్నారు. దొరల తెలంగాణలో అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారంటూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యమ కారులకు 200 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామన్నారు. ఆరు గ్యారంటీలను మొదటి కేబినెట్ సమావేశంలోనే అమలు చేశారు.
తెలంగాణలో కేసీఆర్, ఢిల్లీలో నరేంద్ర మోదీ ఒక్కటేనన్నారు. నరేంద్ర మోదీకి కేసీఆర్, ఎంఐఎం పార్టీ ఇద్దరూ స్నేహితులేనన్నారు. ప్రజా తెలంగాణ రావాలనేదే తన ఆకాంక్ష అని ఆదిలాబాద్ సభలో రాహుల్ గాంధీ అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల కలలను నాశనం చేశారన్నారు. తొమ్మిదేళ్లలో తెలంగాణలో అవినీతి జరిగిందన్నారు.
ప్రజా తెలంగాణలో మహలక్ష్మీ పథకాన్ని అమలు చేస్తూ ప్రతి మహిళ ఖాతాలో రూ. 2,500 జమచేసి వంట గ్యాస్ ను రూ, 500 లకే అందిస్తామన్నారు. రూ. 4 వేలు వృద్దులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఇస్తామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 10 లక్షలు ఆరోగ్య బీమా సౌకర్యాన్ని అందజేస్తామన్నారు.